![]() |
![]() |
.webp)
ఆర్జీవీ బ్యూటీ అరియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉన్న అరియానా ప్రస్తుతం అంతగా కనిపించడం లేదు. ఆర్జీవితో ఇంటర్వ్యూలు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం, టఫ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకోవడం ఇవన్నీ మనకు తెలుసు. ఐతే ఆరియానా ఒకప్పుడు జీరో సైజులో కనిపించేది. కానీ ఇప్పుడు ఫ్యాట్ లుక్కులో బొద్దుగా అయ్యింది. అలాగే అప్పుడప్పుడు బికినీస్ తో ఫాన్స్ కి ఐ ట్రీట్ ఇస్తోంది. అలాంటి ఆరియానా ఇప్పుడు స్కై డైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
" ఈ విధి నా కోసం ఒక ఖచ్చితమైన టైం టేబుల్ అనేది క్రియేట్ చేసింది, దేవుడు నా కోసం ఇలాంటి ఎన్నో ఆశీర్వాదాలను నాకోసమే పంపించాడని అస్సలు ఊహించలేదు ..మీకు ఎందులో ఐతే ఆనందంగా గా ప్రాణం లేచివచ్చినట్టు ఉంటుందో ఆ పనులు చేస్తూ మీ జీవితాన్ని ఆనందంగా గడపండి..ఆకాశాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి ఏకైక మార్గం దానిలోకి దూకడమే" అంటూ ఒక కాప్షన్ పెట్టి స్కై డైవ్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. "మైకేల్ అస్సలు ఇంత ఆనందాన్ని ఊహించలేదు.. వ్వావ్.. చాల అద్భుతంగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను..చాల సంతోషంగా ఉంది" అంటూ స్కై డైవర్ మైకేల్ ని హగ్ చేసుకుంది. ఇక నెటిజన్స్ మాత్రం "సూపర్, ఎంజాయ్ చెయ్యి, మీరు సూపర్ అండి, ఓ ఆరియానా ఎందుకు మూవీస్ లో హీరోయిన్ గా ట్రై చేయకూడదు..మీరు చాల బ్రేవ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఆరియానా బొద్దైన విషయం మీద రీసెంట్ గా నెటిజన్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. సన్నగా ఉంటె ఏంటి, లావుట్గా ఉంటె ఏంటి..లైఫ్ లో ఏదో ట్రై చేయాలనుకుంటున్న అంటూ గట్టిగా కోటింగ్ ఇచ్చింది.
![]() |
![]() |